నవతెలంగాణ – ఆత్మకూరు : ఆత్మకూరు మండలంలో జ్యూడీషియల్ అధికారుల ఆకస్మిక తనిఖీ చేశారు. పరకాల జూనియర్ సివిల్ జడ్జ్ జి.సాయి శరత్ గురువారం స్థానికంగా తిరుమలగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం, పెద్దాపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిరావు బాపులే బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. తనిఖీ సందర్భంగా విద్యార్థినులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భోజన సదుపాయాలు, వసతి గదుల శుభ్రత, పాఠశాల నిర్వహణపై సమగ్రంగా వివరాలు సేకరించారు. విద్యార్థినులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నేరుగా తమకు తెలియజేయాలని ఆయన సూచించారు. తనిఖీలో ఎంపిడిఓ శ్రీనివాస్ రెడ్డి, గురుకుల ప్రిన్సిపాల్ దామర అనిత, సిబ్బంది, వార్డెన్‌లు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
వసతి గృహాలను ఆకస్మిక సందర్శించిన సివిల్ జడ్జి…
- Advertisement -
- Advertisement -



