- Advertisement -
నవతెలంగాణ – కొల్లాపూర్ రూరల్
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని ముక్కుడిగుండం అటవీ ప్రాంతంలోని వట్టిమాకుల కుంట ఏరియాలో అడవిని కొట్టి చెట్లను కాలుస్తున్న విషయం తెలుసుకొని అటవీ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ విధంగా అడవిని నరికి వేయడం చట్టరీత్యా నేరమని గిరిజన రైతులకు అటవీశాఖ అధికారులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అధికారులు రైతులు మధ్య కాస్త తోపులాట చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జయరాజ్ గాయపడ్డట్లు సమాచారం.
- Advertisement -



