- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పొడిగిస్తూ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు పి.వి.శ్రీహరి నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విద్యార్థులు ఈ నెల 20 వరకు, రూ.50 ఆలస్య రుసుంతో ఈ నెల 29 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో డిసెంబర్ 11 వరకు, రూ.500తో డిసెంబర్ 29 వరకు చెల్లించవచ్చు. అదే క్రమంలో హెడ్మాస్టర్ల నుంచి సైబర్ ట్రెజరీకి, డీఈవోలకు చేరాల్సిన తేదీలను సవరించారు. మొత్తంగా డీఈవోల నుంచి ప్రభుత్వ పరీక్షల సంచాలకుల వద్దకు జనవరి 7 నాటికి సమర్పించడంతో ఫీజుల చెల్లింపు ప్రక్రియ పూర్తిగా ముగియనున్నది.
- Advertisement -



