- Advertisement -
– ప్రజలకు అవగాహన కల్పించిన వార్డు సభ్యులు
నవతెలంగాణ – కామారెడ్డి/ బీబీపేట
బీబీపేట మండల కేంద్రంలోని గల్లీలలో ఉన్న వాటర్ ట్యాంకుల వద్ద పేరుకుపోయిన పాకూర్, చెత్తా చెదారాన్ని తొలగించి శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ మొహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మన ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, కారోబార్ సిద్ధరాములు, వాటర్ మెన్ నర్సింలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



