Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిబంధనలకు లోబడే క్లినిక్ సెంటర్లు నడవాలి

నిబంధనలకు లోబడే క్లినిక్ సెంటర్లు నడవాలి

- Advertisement -

ప్రయివేట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో కలెక్టర్ ఆదేశం
నవతెలంగాణ – వనపర్తి 

ప్రయివేట్ ఆస్పత్రులు, పరీక్ష కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ -2010కు లోబడి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఐ.డి. ఒ.సి కాన్ఫరెన్స్ హాల్లో ప్రయివేట్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 2 ఆస్పత్రులు, 4 క్లినిక్ లు, 2 డయాగ్నొస్టిక్ సెంటర్ లు దరఖాస్తు చేసుకోగా కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ పరిశీలన చేసింది. రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న సృష్టి హాస్పిటల్ వనపర్తి, మహాలక్ష్మి పాలీ క్లినిక్ వనపర్తి లకు ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న రాజు పాలీ క్లినిక్, రమేష్ పాలీ క్లినిక్ లకు కమిటీ ఆమోదం తెలిపింది. శ్రీవాసవి ఆయుర్వేద క్లినిక్, శ్రీనివాస డయాగ్నోస్టిక్, ఓంకార్ డయాగ్నోస్టిక్, పల్స్ ఆసుపత్రికి సంబంధించి బయో మెడికల్ వేస్టేజ్ ధృవీకరణ పత్రం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పెండింగ్లో పెట్టిందని తెలిపారు. 

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆస్పత్రులు నిబంధనలకు తు.చ. తప్పకుండా పాటించాలని, సకాలంలో రెన్యువల్ కు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆస్పత్రులు, క్లినిక్ లలో రేట్ ఛార్ట్స్ తప్పక ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శ్రీనివాసులు, డి ఎస్పీ ఉమా మహేశ్వర రావు, ఇతర డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -