- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలో తాడిచెర్ల, మల్లారం,కొండంపేట తదితర గ్రామాల్లో డ్రైనేజిలు చెత్తా,చెదారంతో నిండిపోయి,రోడ్లపై మురికి నీరు ప్రవహిస్తోంది.మల్లారం గ్రామంలోని 8వ వార్డు చెప్తాల వాడ చిన్నపాటి కుంటలను తలపించేలా కనిపించాయి.దీంతో ప్రజలు ఇబ్బందులకు గురైయ్యారు.రోడ్లపై మురికి నీరు ప్రవహించడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచిఉండని పలువురు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు చొరవ తీసుకొని డ్రైనేజీలు శుభ్రం చేసి,రోడ్లపై మురుగునీరు ప్రవహించకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
- Advertisement -