Friday, July 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూసి ఉన్న ఆధార్ సెంటర్..

మూసి ఉన్న ఆధార్ సెంటర్..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
భిక్కనూరు పట్టణ కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో ఆధార్ సెంటర్ మూసి ఉన్న కారణంగా ఆధార్ సెంటర్ కొరకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కేంద్రం ఎందుకు మూసివేసి ఉందో రెవెన్యూ అధికారులకు సైతం తెలియకపోవడం విడ్డూరంగా ఉంది. ఆధార్ కేంద్రం మూసి ఉండడానికి సాంకేతిక సమస్యల కారణమా లేదా ఏదైనా అవకతవకలు, తప్పుల నమోదు కారణంగా ఉన్నత అధికారుల నుండి ఆధార్ కేంద్రాన్ని మూసివేశారా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనాపటికి భిక్కనూర్ మండలంలో ఒకే ఒక్క ఆధార్ కేంద్రం ఉన్న కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి ప్రజల ఆధార్ తిప్పల సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుచున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -