- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అతి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ కారణంగా పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఆకస్మిక వరదలు సంబవించిన విషయం తెలిసిందే. ఈ వరదల కారణంగా శుక్రవారం రాత్రి వరకు 157 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. తాజాగా శనివారం మధ్యాహ్నం వరకు మృతుల సంఖ్య 307కి చేరిందని అధికారులు తెలిపారు. వరదల ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
- Advertisement -