Friday, December 12, 2025
E-PAPER
Homeజాతీయంగోవా నైట్‌క్లబ్‌ ఘటనలో పోలీసుల అదుపులో క్లబ్‌ యజమానులు

గోవా నైట్‌క్లబ్‌ ఘటనలో పోలీసుల అదుపులో క్లబ్‌ యజమానులు

- Advertisement -

పనాజీ : గోవా నైట్‌క్లబ్‌ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులు, క్లబ్‌ యజమానులు సౌరభ్‌ లూథ్రా, గౌరవ్‌ లూథ్రాలను థారులాండ్‌లో గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వీరిని వీలైనంత త్వరాగా థాయిలాండ్‌ నుంచి భారత్‌కు తీసుకునివస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. ఈ విషయంలో గోవా పోలీసులు, సీబీఐ బృందం ముమ్మరంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే, ఈ అగ్ని ప్రమాదం కేసులో స్థానిక పంచాయితీ అధికారి ఒకరు దర్యాప్తునకు సహకరించడం లేదని ఆయన్ను కూడా అరెస్టు చేస్తామని చెప్పారు. అగ్ని ప్రమాదం తరువాత విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలపై ముగ్గురు ప్రభుత్వ అధికారులను సస్పెండ్‌ చేశామని, వీరిలో ఇద్దరు షామిలా మోంటెరో, సిద్ధి హలార్‌ంకర్‌ దర్యా ప్తునకు సహకరిస్తున్నాని తెలిపారు. మూడో అధికారి, పంచాయితీ కార్య దర్శి రఘువీర్‌ బాగ్కర్‌ సహక రించడం లేదని చెప్పారు.

లూథ్రా సోదరుల ముందస్తు బెయిల్‌ పిటిషన్ల కొట్టివేత
గోవా నైట్‌క్లబ్‌ అగ్నిప్రమాదం కేసులో సౌరభ్‌ లూథ్రా, గౌరవ్‌ లూథ్రాలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లను ఢిల్లీ కోర్టు గురువారం తిరస్కరించింది. థాయి లాండ్‌ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే అరెస్టు చేయకుండా ఉండటానికి నాలుగు వారాల ట్రాన్సిట్‌ ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను వీరు బుధవారం కోర్టులో దాఖలు చేశారు. అదనపు సెషన్స్‌ జడ్జి వందన ఈ పిటిషన్‌ తోసిపుచ్చారు.

సహ-యజమాని అజరు గుప్తాకు ఏడు రోజుల కస్టడీ
ఈ కేసులో అరెస్టయిన క్లబ్‌ సహ-యజమాని అజరు గుప్తాకు గోవాలోని కోర్టు ఏడు రోజుల పోలీసుకస్టడీ విధించింది. అజరు గుప్తాను ఢిల్లీలో అరెస్టు చేసిన గోవా పోలీసులు ట్రాన్సిట్‌ రిమాండ్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పర్చిన తరువాత అంజునా పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈనెల 6న రాత్రి 11.45 గంటల సమయంలో ఉత్తర గోవాలోని బిర్చ్‌ బై రోమియో లేన్‌ క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 25 మంది మరణించారు. క్లబ్‌ యజమానులు సౌరభ్‌ లూథ్రా, గౌరవ్‌ లూథ్రాలు ఈ 7న ఉదయం 5.30 గంటలకు ఓ విమానంలో థారులాండ్‌లోని పుకెట్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారి పాస్‌పోర్టులు సస్పెండ్‌ అయిన నేపథ్యంలో ఆ దేశంలో ఉండటం చట్టవిరుద్ధం. దాంతో అక్కడి అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని 24 గంటల్లో భారత్‌కు తరలించే అవకాశం ఉందని సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -