Tuesday, January 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల స్థాయిలో సీఎం కప్ క్రీడలు విజయవంతం చేయాలి

మండల స్థాయిలో సీఎం కప్ క్రీడలు విజయవంతం చేయాలి

- Advertisement -

– సమీక్ష సమావేశంలో ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియంలో ఈనెల 28 నుండి 31వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన సీఎం కప్ 2025 క్రీడలను విజయవంతం చేయాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశం మందిరంలో మండల స్థాయి టీం సభ్యులు, మండల స్థాయి అధికారులతో సీఎం కప్ క్రీడల నిర్వహణపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియంలో నిర్వహించే సీఎం కప్ మండల స్థాయి క్రీడల విజయవంతానికి ప్రతి ఒక్కరు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. వివిధ క్రీడల నిర్వహణపై, పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో తహసిల్దార్ గుడిమేల ప్రసాద్, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, కమ్మర్ పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి ఫిజికల్ డైరెక్టర్లు, సీనియర్ ప్లేయర్ రాహుల్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫిజికల్ డైరెక్టర్లు, పిఈటిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -