- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన సమగ్ర ఓటర్ జాబితా సవరణ(సర్)పై మరోసారి సీఎం మమత ఆందోళన బాటపట్టింది. సర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ కలకత్తాలోని ధర్మసాలలోని మంచాల ఎదుట తన పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో బీజేపీ ఓట్ల సవరణ పేరుతో రిగ్గింగ్ కు పాల్పడుతుందని, ఎన్నికల వ్యవస్థను కాపాడే కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయిందని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. సరైన ఆధారాలు లేకుండా అనేక మందిని ఓటర్ జాబితా నుంచి తొలగించారని మండిపడ్డారు. తర్వలోనే బీజేపీకి బెంగాలీ ప్రజలు గుణపాఠం చెప్తుతారని హెచ్చరించారు.
- Advertisement -



