- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. భాగ్యనగరంలో బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీఉజ్జయిని మహంకాళీ అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ అనిల్, ఎమ్మెల్యే దానం నాగేందర్ .. ఇతర అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. తెలంగాణ ప్రభుత్వం తరపున అమ్మవారికి సీఎం పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారిని మంత్రులు, ఎంఎల్యేలు, అధికారులు దర్శించుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్.. కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేశారు.
- Advertisement -