చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు
నవతెలంగాణ – మద్నూర్
ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రజల ఆరోగ్యానికి వరం లాంటిదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మద్నూర్ మండలంలోని ఆరుగురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ పథకం చెక్కులను నాయకులు గురువారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య నిత్య ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా నిధులు మంజూరు చేయడం ప్రజల ఆరోగ్యానికి వరం లాంటి పథకమని వారు అన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్, సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దరాస్ సాయిలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమాన్లు స్వామి, కొండ గంగాధర్, వట్నాల రమేష్ ,దీన్ దయాల్, కొండ రాజు, దిగంబర్, థైదల్ రాజు ,కుశాల్, మాధవరావు పటేల్ ,సంతోష్ పటేల్, నాగనాథ్, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్.. ప్రజల ఆరోగ్యానికి వరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES