Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ..

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ..

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్ 
మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో సీఎం సహాయ నధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం బాధపడకుండా వారికి సీఎం సహాయ నిధి నుంచి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సహాయ సహకారాలతో నిరుపేదలకు ఈ చెక్కులను పంపిణీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న గౌరజి రాజు కు రూ.40 వేలు, అంజులకు రూ.24 వేల చెక్కులను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్ స్థానిక నాయకులు సాయిబాబా గౌడ్, కుర్మే శ్రీనివాస్, ధనుంజయ్, జావిద్ ఉద్దీన్, రవి, సాయ గౌడ్, , గైని సాయిలు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -