- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్ : ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పలు కార్యక్రమాల్లో శుక్రవారం ఖర్గే పాల్గొననున్నారు.
- Advertisement -