Thursday, October 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారు : ఆది శ్రీనివాస్

సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారు : ఆది శ్రీనివాస్

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుతో చాలా నిరాశ చెందినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని అన్నారు. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా, ప్రతిపక్షాలు కలిసి రాకపోయినా సీఎం రేవంత్ రెడ్డి ఒంటరి పోరాటం చేశారని కొనియాడారు. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పద్దతి ప్రకారం రిజర్వేషన్లు కల్పించామని అన్నారు. కులగణన చేయడంతో పాటు డెడికేటెడ్ కమిషన్ వేసి బీసీల లెక్క తేల్చామని చెప్పారు. బీసీల నోటికాడి బువ్వ అందకుండా పోయింది.. అయినా మేం నిరాశ చెందం.. పోరాటం కొనసాగుతుంది అని కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయపోరాటాన్ని కొనసాగిస్తుందని అన్నారు. తప్పకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి పెడతామని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సహకరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికైనా బీసీల ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. బీసీలు ఎవరూ అధైర్యపడొద్దు.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పనిసరిగా రిజర్వేషన్లు సాధించుకుందామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -