Sunday, January 11, 2026
E-PAPER
Homeజిల్లాలుపేదలకు పెద్దదిక్కుగా సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే 

పేదలకు పెద్దదిక్కుగా సీఎం రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ-పాలకుర్తి
పేద కుటుంబాలకు పెద్దన్న పాత్ర పోషిస్తూ పెద్దదిక్కుగా సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచాడని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి మండలంలోని 116 మంది అర్హులైన లబ్ధిదారులకు కోటి 16,13,456, దేవరుప్పుల మండలంలోని 94 మంది లబ్ధిదారులకు 94 లక్షల పదివేల 904 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు సర్పంచులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పేదలను ఆదుకోవడమే లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు అందించాలంటే అధికార పార్టీ  వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు.

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలు వేల రూపాయలు గత ప్రభుత్వ నాయకులు వసూలు చేసే వారిని విమర్శించారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలను అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నియోజకవర్గ కేంద్రం పాలకుర్తి లనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో దరఖాస్తులను అందించేందుకు హైదరాబాదుకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టే వారిని తెలిపారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి సాధ్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో పాలకుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ పనులను పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని, రిజర్వాయర్ పనుల్లో పురోగతి ఉందని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లావుడియా మంజుల, పాలకుర్తి తహసిలర్ సూత్రం సరస్వతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గిరగాని కుమారస్వామి గౌడ్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, దేవస్థాన మాజీ చైర్మన్ చిలువేరు కృష్ణమూర్తి, సర్పంచులు లోనే శ్రీనివాస్, కారుపోతుల శ్రీనివాస్ గౌడ్, భేతి కుమారస్వామి, గాదరి కుమారస్వామి, గుగులోతు విమల జీవన్ లాల్ నాయక్, గుగులోతు యాకూబ్ నాయక్, జరుపుల జుమీలాల్ నాయక్, బొడిగె ప్రదీప్ గౌడ్, ఉపసర్పంచ్ గోనె కిరణ్, వార్డు సభ్యులు నోముల సతీష్,  మాజీ ఉపసర్పంచ్ లు మారుజోడు సంతోష్, బానోతు కిషన్ నాయక్ లతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -