Tuesday, July 29, 2025
E-PAPER
HomeNewsదివ్య దేశ్‌ముఖ్ విజ‌యంపై పీఎం, సీఎం హ‌ర్షం

దివ్య దేశ్‌ముఖ్ విజ‌యంపై పీఎం, సీఎం హ‌ర్షం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఫిడే ప్రపంచ మహిళల చెస్‌ ఛాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్‌ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘దివ్య దేశ్‌ముఖ్ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సాధించడం చాలా గొప్ప విషయం. ఇద్దరూ కలిసి దేశం గర్వపడేలా చేశారు. సరైన అవకాశాలు లభించినప్పుడు మహిళలు ఎంత ఎత్తుకు ఎదగగలరో నిరూపించార‌ని కొనియాడారు. దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి ఇద్దరూ రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలి’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.

ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్ 2025గా నిలిచిన యువ దివ్య దేశ్‌ముఖ్‌ భారత్ కు గర్వకారణం అని ప్రధాని మోడీ ప్రశంసించారు.ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రధాని శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేసారు. ఇద్దరు అత్యుత్తమ భారతీయ చెస్ క్రీడాకారిణులు పాల్గొన్న చారిత్రాత్మక ఫైనల్ ఇదని అన్నారు. ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ 2025 దివ్య దేశ్‌ముఖ్విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -