- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించే ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’కు మోడీని ఆహ్వానించారు. అంతకుముందు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం, భట్టి భేటీ అయ్యారు. పలువురు కేంద్ర మంత్రులతో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా సీఎం ఆహ్వానించనున్నారు. కాగా, మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను సీఎం రేవంత్‌రెడ్డి కలిసి గ్లోబల్ సమిట్‌కు రావాలని కోరారు.
- Advertisement -



