Wednesday, August 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రొఫెసర్ జయశంకర్, గద్దర్ లకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి

ప్రొఫెసర్ జయశంకర్, గద్దర్ లకు సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ సాధన కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్, ఉద్యమానికి తన పాట ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అందించిన సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ఆచార్య జయశంకర్ జయంతి, గద్దర్ వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆ మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -