- Advertisement -
నవతెలంగాణ -హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 22న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారీగా సమీక్ష జరగనుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, అంశాలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. MPTC, ZPTC ఎన్నికల్లో 42శాతం బీసీ రిజర్వేషన్ల అంశం, సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణ, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ, IAS, IPS అధికారుల పనితీరు, బదిలీలపై కూడా మంత్రులతో చర్చించనున్నట్లు సమాచారం.
- Advertisement -



