- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21న ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు హాస్టళ్ల భవనాలను, రూ.10 కోట్లతో నిర్మించనున్న డిజిటల్ లైబ్రరీ రీడింగ్ రూమ్ పనులను ప్రారంభిస్తారు. అనంతరం ఠాగూర్ ఆడిటోరియంలో ప్రొఫెసర్లు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే ఈ కార్యక్రమంలో ‘సీఎం రీసెర్చ్ ఫెలోషిప్’ పథకాన్ని ప్రారంభించనున్నారు.
- Advertisement -