Saturday, January 10, 2026
E-PAPER
Homeజిల్లాలుఫిబ్రవరిలో కొడవటంచకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

ఫిబ్రవరిలో కొడవటంచకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ పున:ప్రతిష్టాపన మహోత్సవం
నెలాఖరు నాటికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
ఆలయంలో అధికారులతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ – భూపాలపల్లి

వచ్చే ఫిబ్రవరి నెలలో కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయ పున:ప్రతిష్టాపన మహోత్సవంనకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారి ఆలయంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రెవెన్యూ, దేవాదాయ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్అండ్‌బి, ఇరిగేషన్, పోలీస్, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్తు శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు బాలాలయంలో స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఆలయంలో జరుగుతున్న పనులను కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. అనంతరం జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 12వ తేదీలోగా అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే చేపట్టిన పనులకు సంబంధించిన ఎంబి రికార్డును ఈ నెల 19వ తేదీలోగా పూర్తి చేయాలని దేవాదాయ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

సమీక్షకు ముందు దేవాలయ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించి, పనుల నాణ్యత, వేగంపై అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే నెలలో దేవాలయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చే అవకాశం ఉందని, ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి ఈఈకి సూచించారు. 

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చేపట్టిన అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు పనుల కొరకు ప్రతి పాదనలు, పూర్తి అయిన పనులకు ఎంబి రికార్డులను అందచేయాలని సూచించారు. 

 ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, విద్యుత్ శాఖ ఎస్ఈ మల్చూర్ నాయక్, పిర్ ఎస్ఈ చక్రవర్తి,  దేవాదాయశాఖ ఈఈ దుర్గ ప్రసాద్, ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈ శ్వేత, ఆర్అండ్‌బి ఈఈ రమేష్,  ఇరిగేషన్ ఈఈ  బసవ ప్రసాద్, ఆర్డిఓ హరికృష్ణ, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి,  ఎఫ్డిఓ అప్పలకొండ, తహసీల్దార్ శ్వేతా, దేవస్థానం ఈఓ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -