Tuesday, July 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు పాశమైలారంకు సీఎం రేవంత్ రెడ్డి

నేడు పాశమైలారంకు సీఎం రేవంత్ రెడ్డి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం 9 గంటలకు పటాన్ చెరు రానున్నారు. సిగాచి పరిశ్రమలో క్షతగాత్రులై పటాన్ చెరు ధృవ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు. 11 గంటలకు సీఎం తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రమాద ఘటన విచారణకు ప్రత్యేక కమిటీ వేసిన విషయం తెలిసిందే. మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర అధికారులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సీఎసీఎస్​ రామకృష్ణారావు ఆధ్వర్యంలో డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ స్పెషల్​ సీఎస్​, లేబర్​ డిపార్ట్మెంట్ పీఎస్​, హెల్త్ సెక్రెటరీ, ఫైర్​ సర్వీసెస్​ అడిషనల్​ డీజీల ఆధ్వర్యంలో ఏర్పడిన కమిటీ విచారణ కొనసాగిస్తున్నది. ఉదయం వరకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -