- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నగరంలోని లక్డీకాపూల్‌లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆవిష్కరించారు. రోశయ్య జయంతి సందర్భంగా నేతలు నివాళి అర్పించారు. ఆయన సేవలను స్మరిస్తూ కాసేపట్లో రవీంద్రభారతిలో సభ నిర్వహించనున్నారు. కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -