- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి గురువారం పర్యటించారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. లింగంపేట్‌లో వరదల సమయంలో బ్రిడ్జి పరిస్థితిని ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా తెలుసుకున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ తరహాలో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.








- Advertisement -