- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. జిల్లాలో రూ.500 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అయితే ఈ సభలో జిల్లాకు ఎయిర్‌పోర్ట్‌పై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో 700 మంది పోలీసులతో పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు.
- Advertisement -



