- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : సీఎం రేవంత్ ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2గం.లకు నర్సంపేటకు చేరుకుని రూ.531 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్- రూ.200కోట్లు, మెడికల్ కాలేజీ- రూ.130కోట్లు, నర్సింగ్ కాలేజీ – రూ.25కోట్లు, వరంగల్-నర్సంపేట 4 లేన్ల రోడ్డు- రూ.82.56 కోట్లు, నర్సంపేట పరిధిలో సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
- Advertisement -



