- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. పార్లమెంట్ భవనంలోనే పీఎంతో సమావేశమై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం రేవంత్ కలిసి సదస్సుకు రావాలని కోరనున్నారు.
- Advertisement -



