- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ కొందరు ఉన్నతాధికారులపై మండిపడ్డట్లు తెలుస్తోంది. గతవారం ఢిల్లీ టూర్లో కేంద్రమంత్రి గడ్కరీకి సీఎం, అధికారులు ₹1600 కోట్ల పనుల DPR ఇచ్చారు. అప్పుడు వారితో ₹1600 కోట్లు కాదు.. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల DPR తెస్తే ₹20వేల కోట్లు ఇస్తామని గడ్కరీ అన్నారట. దీంతో డబ్బు ఇస్తామన్నా ఎందుకు డ్రాఫ్ట్ రెడీ చేయలేదని, సీనియర్ అధికారులై ఉండి ఏం లాభమని వారిపై రేవంత్ ఫైర్ అయ్యారని సమాచారం.
- Advertisement -