నవతెలంగాణ – హైదరాబాద్: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో రాజకీయాలకు తావు లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ఈ సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు, మంత్రులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సీఎం రేవంత్ అత్యవసర సమీక్షా సమావేశం..
- Advertisement -
- Advertisement -