Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఫిబ్రవరి 3 నుంచి 9 వరకు సీఎం రేవంత్ బహిరంగ సభలు

ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు సీఎం రేవంత్ బహిరంగ సభలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి జిల్లాల బాట పట్టనున్నారు. ఈ మేరకు 9 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహించే బహిరంగసభలలో ఆయన పాల్గొననున్నారు. నేడు గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ, పీఏసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖారారు అయింది. ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకూ సీఎం బహిరంగ సభలు జరగనుండగా.. ఈ బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కు అప్పగించారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో తొలి బహిరంగ సభ జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -