నవతెలంగాణ – హైదరాబాద్: గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో మురుగునీరు రోడ్లపై వస్తోంది. ముఖ్యంగా మూసీ నది, నాలాల పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి అమీర్‌పేట్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. బుద్ధ నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. స్థానికులకు వాటిని పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
బల్దియా అధికారులు, హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ.. ఎక్కడా నీరు నిలిచిపోకుండా, వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్ కు సూచించారు. బల్కంపేటలో, గంగూబాయి బస్తీలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకొని, వాటిని పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
హైదరాబాద్ ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ ఆకస్మిక పర్యటన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES