Tuesday, November 18, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి

- Advertisement -

న్యూడిల్లీ, హైదరాబాద్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు
మంత్రులు, ఇతర ప్రముఖుల సంతాపం
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్‌కు ఆదేశం


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షించాలని సీఎస్‌, డీజీపీని ఆదేశించారు. కేంద్ర విదేశాంగ శాఖ, సౌదీ ఎంబస్సీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. అవసరమైన సహాయక చర్యలకు రంగంలోకి దిగాలని సూచించారు. ఢిల్లీలో ఉన్న కోఆర్డినేషన్‌ సెక్రటరీ గౌరవ్‌ ఉప్పల్‌ను సీఎస్‌ అప్రమత్తం చేశారు. ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించి వెంటనే అందించాలని అదేశించారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు
బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు తగు సమాచారాన్ని, సహాయ సహకారాలు అందించేందుకు హైదరాబాద్‌లోని బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. (ఫోన్‌ నెంబర్లు 79979 59754, 99129 19545) న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసిన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. న్యూఢిల్లీలోని కాంటాక్ట్‌ నంబర్లు….. 1) వందన, పీఎస్‌ టూ రెసిడెంట్‌ కమిషనర్‌, లైజన్‌ హెడ్‌- 98719 99044, సీహెచ్‌. చక్రవర్తి, పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌- 99583 22143, రక్షిత్‌ నాయక్‌, లైజన్‌ ఆఫీసర్‌- 96437 23157

బాదితులను ఆదుకుంటాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బస్సు దుర్ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబ బంధువులను సోమవారం విద్యానగర్‌లోని వారి నివాసంలో కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మృతుల బంధువులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాల ఆదుకుంటుందని అన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి సంతాపం
సౌది బస్సు దుర్ఘటనపె డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంతాపం ప్రకటించారు. బాదిత కుటుంబాలకు అన్ని రకాల సాయం అందిస్తామని అన్నారు. మంత్రులు దనసరి అనసూయ సీతక్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌, ఇతర ప్రముఖులు మృతుల కుటుంబాలకు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -