- Advertisement -
ప్రయాణికులతో సెల్ఫీలు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ శుక్రవారం ఆకస్మికంగా చెన్నై మెట్రోలో ప్రయాణించారు. చెన్నై సెంట్రల్ నుండి ఎ.ఇ-డిఎంఎస్ వరకు సాగిన ఈ మెట్రో ప్రయాణంలో స్టాలిన్ వెంట థౌజండ్స్ లైట్స్ ఎమ్మెల్య్యే ఎన్.ఇళియన్ వున్నారు. మెట్రో స్టేషన్ వద్ద ప్రజలతో ఆయన ముచ్చటించారు. అలాగే రైల్లో కూడా ప్రయాణికులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ ఎన్నికల వేళ ప్రజలకు దగ్గరవడమే లక్ష్యంగా ఆయన రైలు ప్రయాణాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి అకస్మాత్తుగా తమతో ప్రయాణిస్తున్నారనేసరికి చాలామంది ఆయనతో కలిసి సెల్ఫీలు దిగడం కనిపించింది.
- Advertisement -



