- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖైరతాబాద్ వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు మహాగణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆయన వెంట పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్, మంత్రులు పొన్నం, సురేఖ కూడా వెళ్తారు. కాగా శనివారం మహాగణపతిని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. దీంతో ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఇవాళ రాత్రి 12 గంటల నుంచే భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నారు.
- Advertisement -