Sunday, December 7, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనిమ్స్‌లో పేషెంట్‌ బ్లడ్‌ మేనేజ్‌మెంట్‌పై సీఎంఈ అండ్‌ వర్క్‌షాప్‌

నిమ్స్‌లో పేషెంట్‌ బ్లడ్‌ మేనేజ్‌మెంట్‌పై సీఎంఈ అండ్‌ వర్క్‌షాప్‌

- Advertisement -

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో పేషెంట్‌ బ్లడ్‌ మేనేజ్‌మెంట్‌పై వర్క్‌షాప్‌ జరిగింది. ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ విభాగం ఆధ్వర్యంలో ”ఆప్టిమైజింగ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ ప్రాక్టీసెస్‌-సేఫర్‌ క్లినికల్‌ ఔట్‌కమ్స్‌ కోసం పేషెంట్‌ బ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ స్ట్రాటజీస్‌” అనే అంశంపై శనివారం ఎమర్జెన్సీ ట్రామా ఆడిటోరియంలో సీఎంఈ (కంటిన్యూయింగ్‌ మెడికల్‌ ఎడ్యుకేష్‌), పేషెంట్‌ బ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ సీపీడీ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్వహణ కార్యదర్శిగా డాక్టర్‌ కందుకూరి మహేష్‌ కుమార్‌ వ్యవహరించారు. ఆయన ప్రారంభ ఉపన్యాసం, అతిథుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాథాలజీ విభాగం అదనపు ప్రొఫెసర్‌ డాక్టర్‌ తార రోషినిపాల్‌ జ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమ నిర్వహణ చైర్‌పర్సన్‌, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ విభాగ అధిపతి డాక్టర్‌ సుధీర్‌ కుమార్‌ వుజిని.. లక్ష్యాలను వివరించారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ డాక్టర్‌ బోనగిరి శాంతి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మురళీ కృష్ణ పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో వివిధ విభాగాల వైద్య నిపుణులు, అనస్థీషియా హెడ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీలత, కార్డియో-థొరాసిక్‌ సర్జరీ హెడ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అమరేష్‌, ఎమర్జెన్సీ మెడిసిన్‌ హెడ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.సునీల్‌ కుమార్‌, ఆర్థోపెడిక్స్‌ అదనపు ప్రొఫెసర్లు డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌, డాక్టర్‌ అరవింద్‌, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బి.శాంతి, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ అదనపు ప్రొఫెసర్‌ డాక్టర్‌ మురళీకృష్ణ, ఈఎస్‌ఐ హాస్పిటల్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీహెచ్‌.శ్రీనివాస్‌, యశోద ఆస్పత్రి కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఎ.కీర్తి తమ విలువైన అనుభవాలను పంచుకున్నారు. డాక్టర్‌ మహేష్‌ కుమార్‌ నిర్వహించిన క్విజ్‌ కార్యక్రమం వర్క్‌షాప్‌లో విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సుమారు 158 మంది వైద్యులు పాల్గొన్నారు. ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌ విభాగానికి చెందిన నర్సింగ్‌ సిబ్బంది, టెక్నీషియన్లు బిడుగు శేఖర్‌, వెంకటరత్నం, చిరంజీవి, పద్మజ, సుజాత, రిటైర్డ్‌ ఉద్యోగి మల్లికార్జున, విద్యార్థులు, ఇతర సహాయక సిబ్బంది సహకరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -