నవతెలంగాణ – వెల్దండ
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పేదలకు అందిస్తున్న సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం లాంటిదని కంటోన్ పల్లి మాజీ సర్పంచ్ పెద్ది రామకృష్ణ అన్నారు. వెల్దండ మండల పరిధిలోని కంటోన్ పల్లి గ్రామానికి చెందిన కంఠం అంజమ్మ పేరిట మంజూరైన రూ . 21500 ల సీఎం సహాయనిది చెక్కును మాజీ సర్పంచ్ రామకృష్ణ లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎం సహాయనిధి చెక్కు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ సురేందర్, పంచాయతీ కార్యదర్శి ఫయాజ్ తదితరులు ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదల పాలిట వరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES