Tuesday, June 24, 2025
E-PAPER
Homeఆదిలాబాద్సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం..

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి  చెందిన ఉప్పులేటి రాజకుమార్కు మంజూరైన రూ.26 వేల  సీఎంఆర్ఎఫ్  చెక్కును శుక్రవారం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ..  రోడ్డుప్రమాదంలో రాజ్కుమార్ కాలువిరగడంతో ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకొని, సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఆయనకు ఖానాపూర్ ఎమ్మెల్యే  బొజ్జు పటేల్  చెక్కు మంజూరు చేయించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఏఎంసీ డైరెక్టర్ ప్రదీప్, గ్రామ కమిటీ అధ్యక్షుడు గుగులావత్ రవి, మాజీ ఉపసర్పంచ్ చిందం చంద్రయ్య,కె. శ్రీనివాస్ కోవ శాంతయ్య గుండా నరసయ్య, సాదం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -