జేడీయూ(ఎస్)లో టిక్కెట్ల రగడ
బీహార్ సీఎం నితీశ్ కుమార్ నివాసం ముట్టడి
సీటు దక్కని అభ్యర్థుల నిరసన ప్రదర్శనలు
రెబల్స్‌గా పోటీ చేస్తామంటూ హెచ్చరికలు
పాట్నా : జేడీయూ(ఎస్)లో టిక్కెట్ల రగడ భగ్గుమంటోంది. బీజేపీ, జేడీయూ చేరో 101 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించినా.. ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై ఇప్పటికీ స్పష్టత కుదరలేదు. నితీశ్ పాలనలో రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్ని ఏమార్చేలా తాజా ఎన్నికల్లో హామీలు గుమ్మరిస్తున్నారు. మరోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కడ కొంపముంచుతాయోనన్న భయం వెంటాడుతోంది. మంగళవారం పాట్నాలోని బీహార్ సీఎం నితీశ్ కుమార్ నివాసం వద్ద టిక్కెట్లు లభించని నేతలు ధర్నాకు దిగారు. సీటు ఇవ్వకపోతే రెబల్స్‌గా పోటీచేస్తామంటూ వార్నింగ్‌లు ఇస్తుండడంతో నితీశ్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి.
టిక్కెట్లు లభించని ఆశావహుల దెబ్బతో సీఎం ఇంటివద్ద భారీ భద్రతా బలగాలు మోహరించాయి. ముఖ్యమంత్రి ఇంటి వద్ద ఆంక్షలు ఉన్నప్పటికీ, అనేక మంది నాయకులు, పార్టీ కార్య కర్తలు భారీగా గుమి గూడుతూనే ఉన్నారు. మద్దతు దారులు తమ అభ్యర్థులకే పార్టీ టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినా దాలు చేశారు. మరి కొందరు అనేక నియోజక వర్గాల్లో బయటి వ్యక్తులను పోటీకి దింపాలనే నిర్ణయాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. అలాగే మాజీ శాసనసభ్యుడు గోపాల్ మండల్ నివాసం వెలుపల కూర్చుని ధర్నా నిర్వహించారు. కుర్తా, నబీనగర్ , దర్భంగా నుంచి వచ్చిన కార్యకర్తలు కూడా నిరసనలో పాల్గొన్నారు.భాగల్పూర్ జిల్లాలోని గోపాల్పూర్ స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతున్న మండల్.. ముఖ్యమంత్రి తనను కలిసే వరకు ఇక్కడే ఉంటానని బైటాయిం చారు. ”నేను ముఖ్యమంత్రిని కలవడానికి ఇక్కడికి వచ్చా. ఆయనను కలిసి (అసెంబ్లీ ఎన్నికలకు) టికెట్ లభిస్తుందని హామీ ఇచ్చే వరకు ఇక్కడే ఉంటా. నా టికెట్ తిరస్కరించబడదని నమ్ముతున్నా. భద్రతా సిబ్బందికి ఇబ్బందనుకుంటే లాఠీచార్జీ చేయొచ్చు” అని ఆయన అన్నారు.భాగల్పూర్ నుంచి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే అజరు మండల్ తన పార్లమెంటరీ స్థానానికి రాజీనామా చేస్తూ నితీశ్ కుమార్‌కు లేఖ సమర్పించారు. భాగల్పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తమను నిర్లక్ష్యం చేశారని పేర్కొంటూ అజరు మండల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారపార్టీకి చెందిన నేతల నిరసనజ్వాలలతో సీఎం నివాసం వద్ద భద్రత ఏర్పాట్లకు నానాయాతన పడుతున్నామని ఉన్నతాధికారులు తెలిపారు
సీఎంకు సీట్ల లొల్లి
- Advertisement -
- Advertisement -