Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంనేడు తిర్మలాపురంలో సీఎం పర్యటన

నేడు తిర్మలాపురంలో సీఎం పర్యటన

- Advertisement -

నవతెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిర్మలాపురంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఆలేరు ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా గంధమల్ల రిజర్వాయర్‌, మెడికల్‌ కాలేజీ, వేద పాఠశాల(యాదగిరిగుట్ట), ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ (తుర్కపల్లి), మూడు ప్రభుత్వ కార్యాలయాలు(మోటకొండూరు), ఆలేరు, కాల్వపల్లి బ్రిడ్జీలకు, రహదారులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం తిర్మలాపురానికి సీఎం చేరుకుంటారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. బందోబస్తు ఏర్పాట్లు చేసినట్టు రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img