Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంసీఎం వైజాగ్ పర్యటన రద్దు..

సీఎం వైజాగ్ పర్యటన రద్దు..

- Advertisement -

నవతెలంగాణ – అమరావతి: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన ఏపీ సీఎం చంద్రబాబు కార్యక్రమాలపై ప్రభావం చూపింది. ఈ దుర్ఘటన నేపథ్యంలో, నేటి విశాఖ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం, సీఎం ఈరోజు విశాఖలో పర్యటించాల్సి ఉంది. అక్కడ ఏర్పాటు చేసిన ‘న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ రీజనల్ వర్క్‌షాప్’లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. దీంతో పాటు, కూటమి ప్రభుత్వం ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరిట నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad