స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్
ఆర్టీసీ డిపోల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ల అమలును రద్దు చేయాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీరాంజనేయులు, వీఎస్.రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ లేబర్ పాలసీ ”శ్రమ శక్తి నీతి – 2025” ని రద్దు చేయాలనీ, విద్యుత్ బస్‌ల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీకి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలపై ఉన్న ఆంక్షలు ఎత్తి వేసిి గుర్తింపు ఎన్నికలుు జరపాలని కోరారు. రిటైర్డ్ కార్మికులకు రావల్సిన అన్ని రకాల బకాయిలను వెంటనే చెల్లించాలనీ, 2021, 2025 వేతన సవరణ ఒప్పందాలను అమలు చేయాలనీ, 2017 అలవెన్సులు సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని ప్రయి వేటు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్రలను ప్రభుత్వాలు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఖమ్మం డిపో వద్ద ఫెడరేషన్ ఉప ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, రాష్ట్ర కార్య దర్శి పి.సుధాకర్, నల్లగొండ డిపో వద్ద కోశాధికారి సత్తి రెడ్డి, రాజేంద్ర నగర్ డిపో వద్ద ఉపాధ్యక్షులు కృష్ణ, బర్కత్ వద్ద కార్యదర్శి చంద్ర ప్రకాష్, జీడిమెట్ల వద్ద ఉపాధ్యక్షులు గీత, ఆదిలాబాద్ వద్ద రాష్ట్ర కార్యదర్శి వీ. భీమ్ రావు, వరంగల్ డిపో వద్ద రాష్ట్ర కార్యదర్శి ఉపేంద్ర చారీ, సూర్యాపేటలో రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్. మహబూబ్నగర్‌లో రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్ తదితరులు పాల్గొని తమ నిరసన తెలిపారు.
కోడ్లను వెంటనే రద్దు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



