Friday, October 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆశావహుల ఆశలపై చల్లటి నీళ్ళు 

ఆశావహుల ఆశలపై చల్లటి నీళ్ళు 

- Advertisement -

ప్రభుత్వ వైఫల్యం అంటున్న ప్రజలు 
నవతెలంగాణ – నసురుల్లాబాద్  

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన స్టే ఆశావహుల్లో ఆందోళన కలిగిస్తోంది. ‘ఎప్పటికైనా నేను నా ఊరికి సర్పంచ్ కావాలని కొందరు.. నేను ఎంపీటీసీగా గెలిచి అన్ని అనుకూలిస్తే ఎంపీపీని కావాలని మరికొందరు.. ఇంకొందరు అయితే ఎప్పటికైనా మా జిల్లాకు జెడ్పీ చైర్మన్ కావాలని కలలు కంటే.. మరికొందరు కనీసం మా గ్రామానికి వార్డు మెంబరు అయినా చాలు అనుకున్నారు. ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించడంతో కొంతమంది నిరాశకు గురికాగా, మరికొంతమంది రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావడంతో ఇక పదవులు తమకు దక్కినట్లేనని సంబుర పడ్డారు.

గురువారం నుంచి నామినేషన్లు అనగానే.. ఆశావహులంతా ఊహల పల్లకిలో విహరించారు. ఇప్పటికే పెద్దఎత్తున ఖర్చులు చేశాం, అందరినీ కలిశాం.. హామీలు కూడా ఇచ్చాం.. ఇక విజయం నాదేనని నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. ఈ తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇన్నాళ్లు ఖర్చు పెట్టాం.. అందరిని ఒప్పించుకున్నాం.. కానీ తర్వాత రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయో.. రావోనని ఆందోళన చెందుతున్నారు. 

బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్ మండలం 19 గ్రామ పంచాయతీలు 174 వరదలు ఉండగా 8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. అలాగే బీర్కూరు మండలంలో 13 గ్రామ పంచాయతీలో 114 గ్రామ వార్డులు ఉన్నాయి .8 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో ఎప్పటికైనా నేను నా ఊరికి సర్పంచ్ కావాలని కొందరు.. నేను ఎంపీటీసీగా గెలిచి అన్ని అనుకూలిస్తే ఎంపీపీని కావాలని మరికొందరు.. ఇంకొందరు అయితే ఎప్పటికైనా మా జిల్లాకు జెడ్పీ చైర్మన్ కావాలని కలలు కంటే.. మరికొందరు కనీసం మా గ్రామానికి వార్డు మెంబరు అయినా చాలు అనుకున్నారు. ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించడంతో కొంతమంది నిరాశకు గురికాగా, మరికొంతమంది రిజర్వేషన్లు తమకు అనుకూలంగా రావడంతో ఇక పదవులు తమకు దక్కినట్లేనని సంబుర పడ్డారు.

గురువారం నుంచి నామినేషన్లు అనగానే.. ఆశావహులంతా ఊహల పల్లకిలో విహరించారు. ఇప్పటికే పెద్దఎత్తున ఖర్చులు చేశాం, అందరినీ కలిశాం.. హామీలు కూడా ఇచ్చాం.. ఇక విజయం నాదేనని నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇన్నాళ్లు ఖర్చు పెట్టాం.. అందరిని ఒప్పించుకున్నాం.. కానీ రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వస్తాయో.. రావోనని, అనవసరంగా ఆస్తులు, డబ్బులు కోల్పోయాం అని ఆవేదన చెందుతున్నారు.

హైకోర్టు స్టే కార్యదర్శులపై దిగుబండగా మారింది

గ్రామ పంచాయతీలు ప్రస్తుతం నిధుల కొరత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాకపోవడం, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. స్థానిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రల ఏర్పాటు, ఓట్ల జాబితా తయారు, వార్డుల, సర్పంచ్, ఎంపీటీసీల రిజర్వేషన్లు వెల్లడించడంతో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఉపిరి పీల్చుకున్న అధికారులకు హై కోర్టు స్టే ఇవ్వడంతో మళ్లీ కథ మొదటికి వచ్చిందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలు, వాటికి సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ వైఫల్యం వలనే జరిగిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -