- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారీ వర్షాల కారణంగా దేశరాజధాని ఢిల్లీలోని ఓ చారిత్రక కట్టడం ప్రాంగణంలోని దర్గా కుప్పకూలింది. నిజాముద్దీన్ ప్రాంతంలోని మొఘల్ చక్రవర్తి హుమయూన్ సమాధి సమీపంలో ఉన్న దర్గా పైకప్పు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద పలువురు పర్యాటకులు చిక్కుకున్నట్లు సమాచారం. ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -