నవతెలంగాణ-హైదరాబాద్ : రాతి గనిలో కార్మికులు పనిచేస్తుండగా.. ఒక్కసారిగా గని కూలిపోయింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న 15 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని సొనభద్ర జిల్లాలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. బిల్లీ మార్కుండి మైనింగ్ ప్రాంతంలోని ఓబ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటన సంఘటన స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు రెండు ప్రైవేటు కంపెనీల రక్షక బృందాలు, ఓబ్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
కూలిన రాతి గని..శిథిలాల కింద 15 మంది కార్మికులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



