నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వయం ఉపాధి కోసం 60 మందికి కుట్టు మిషన్ల శిక్షణ మెచ్చిన సోనియా శంకర్ ఫౌండేషన్ నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు. సోమవారం సాయంత్రం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సోనియా శంకర్ ఫౌండేషన్ వారు కలసి బేటీ బచావో బేటీ పడవో పథకము లో భాగంగా కుట్టు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శిక్షణ పొందిన 60 మంది మహిళలకు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సర్టిఫికెట్ ప్రధానం చేశారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళాలు సాదికరత సాధించాలి అంటే ఆర్థికంగా వారు వారి కాళ్లపై నిలబడే విధంగా ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనాలని, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఏ ప్రమీల, సోనియా శంకర ఫౌండేషన్ చైర్మన్ శంకర్ బొలెరావు, వైస్ చైర్మన్, శిక్షణ నిచ్చిన సోనియాశంకర్, జిల్లాలోని సిడిపిఓలు సూపర్వైజర్ జిల్లా మహిళా సంక్షేమ శాఖ సిబ్బంది మొదలగువారు పాల్గొన్నారు.
సోనియాశంకర్ ఫౌండేషన్ ను అభినందించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -