నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలం బోల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు రావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్సీలో ఉద్యోగుల హాజరు పట్టికను చూసి హాజరైన ఉద్యోగుల వివరాలను కనుక్కున్నారు గర్భిణీ స్త్రీల సేవలు ప్రసవానంతర సేవలు పై ఫోన్ ద్వారా గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు, అన్ని రికార్డులు పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందించాలని తద్వారా ప్రజల్లో ప్రజా వైద్య సేవలపై నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు. అనంతరం ఆయుష్మాన్ ఆయుర్వేద కేంద్రాన్ని సందర్శించి వైద్య సేవలను పై సమీక్ష చేశారు. మండల వైద్యాధికారి డాక్టర్ యామిని శృతి , సిబ్బంది ఉన్నారు.
Collector inspects: బొల్లెపల్లి పిహెచ్సిని తనిఖీ చేసిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -



