అర్డిఓ రవి కుమార్..
నవతెలంగాణ – డిచ్ పల్లి
రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శనివారం డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండలంలోని ఆయా గ్రామాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారులు రాజ్ వీర్, అనంతరావు, తాహసిల్దార్లు శ్రీనివాస్ రెడ్డి,వెంకట్ రావులకు మండల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మండలంలో 23గ్రామలు ఉండగా, దీనిలో మూడు గ్రామపంచాయతీలు వెంగల్ పడ్, ఇందల్ వాయి తాండా, స్టేషన్ తాండా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. కేకే తండాలో సర్పంచ్ ఏకగ్రీవం కాగా, మిగతా వార్డుకు ఎన్నికలు జరగనున్నాయి. మండలంలో మొత్తం 175 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 19 సర్పంచ్లకు71మంది పోటి పడుతున్నారు. 102 వార్డులకు గాను 242మంది పోటిలో ఉన్నారు. 498 మందిని అలర్ట్ చేసినట్లు వారు కలెక్టర్కు వివరించారు. నిజామాబాద్ ఆర్డిఓ రవికుమార్ డిచ్ పల్లి, ఇందల్ వాయి ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించి ఏలాంటి లోటుపాట్లు లేకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ ముగించాలని సూచించారు. అనంతరం ఎన్నికల సామాగ్రితో పోలింగ్ సిబ్బందికి వారికి కేటాయించిన బస్సుల్లో ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వినోద్ ఆధ్వర్యంలో ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ జి సందీప్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు.ఈ కార్యక్రమంలో ఎంపిఓ శ్రీనివాస్ గౌడ్,రాజ్ కాంత్ రావు, రామకృష్ణ, సూపరింటెండెంట్ నవీన్, పంచాయతీ కార్యదర్శులు, జపిఓలు,జోనల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.



