Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్

వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మూడో దశలో కాటారం, మల్హర్, మహా ముత్తారం, మహదేవపూర్ మండలాలలో జరుగుతున్న గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రక్రియను బుధవారం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్ కంట్రోల్ రూమ్‌ నుండి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సాధారణ పరిశీలకులు ఫణీంద్ర రెడ్డి  పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడారు గుర్తించిన 35 క్రిటికల్ మరియు సెన్సిటివ్ పోలింగ్  కేంద్రాలలో  జరుగుతున్న పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా  పరిశీలించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం ద్వారా  పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

కాటారం మండలంలో 9, మహదేవపూర్ మండలంలో 15, మల్హర్ మండలంలో 11  మొత్తం 35 పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. అలాగే  32 మంది సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -